అక్షరటుడే, హైదరాబాద్: Jan 03 Gold Prices | ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరల్లో Silver Prices రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, తాజాగా బంగారం ధరలు క్రమంగా దిగివస్తుండటం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు ఏవైనా బంగారం కొనుగోలు తప్పనిసరి అనే భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటి బంగారం ధరలు డిసెంబర్ చివరి వారంలో తులానికి రూ. 1.42 లక్షలకుపైగా ఉండగా, ఇప్పుడు స్పష్టంగా తగ్గాయి.
Jan 03 Gold Prices | క్రమేపి తగ్గుదల..
జనవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,860 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల Silver Prices విషయానికి వస్తే, ఇటీవల కిలో వెండి ధర రూ.2,70,000 వరకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వెండి ధర కూడా భారీగా దిగివచ్చి కిలోకు రూ.2,42,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,210 కాగా – 22 క్యారెట్ల ధర రూ.1,24,860గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,390 కాగా – 22 క్యారెట్ల ధర రూ.1,25,010గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,36,210కు – 22 క్యారెట్ల బంగారం రూ.1,24,860కు లభిస్తోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,250గా ఉండగా – 22 క్యారెట్ల ధర రూ.1,25,810గా కొనసాగుతోంది.
- బెంగళూరులో కూడా హైదరాబాద్, ముంబై తరహాలోనే 24 క్యారెట్ల బంగారం రూ.1,36,210కు – 22 క్యారెట్ల బంగారం రూ.1,24,860కు లభిస్తోంది.
- మొత్తంగా చూస్తే ఇటీవల పెరిగిన ధరలతో కొనుగోలు వాయిదా వేసుకున్న వారికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.