అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Smart Phone | చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ పౌచ్‌లలో డబ్బులు పెట్టుకుంటారు. జీవితంలో భాగమై పోయిన ఫోన్ వెంట ఉంటుంది కాబట్టి, తక్షణ అవసరాల కోసం కొంత డబ్బును పౌచ్‌లో పెడుతారు. మరికొందరైతే తమ ఆఫీస్ ఐడీ కార్డులు(ID Cards), ఏటీఎం కార్డులు(ATM Cards) పెట్టుకుంటారు. ఇంకొంత మంది తమతో పాటు తమకు ఇష్టమైన ఫొటోలు ఉంచుతారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదమని వారికి తెలియదు. ఇలా ఫోన్ వెనుకాల డబ్బులు, కార్డులు, ఫొటోలు పెట్టడం వల్ల ఫోన్ పేలిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Smart Phone | అలా చేయడం మానుకోండి..
ఫోన్‌ను వాలెట్‌లా వాడుకోవడం చాలా మందికి అలవాటైంది. ఫోన్ పౌచ్(Phone Pouch) వెనుక నోట్లు, ఐడీ కార్డులు, ఏటీఎంలు, పిన్ వంటి చిన్న వస్తువులను ఉంచుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఫోన్ దెబ్బతినవచ్చు లేదా పేలిపోవచ్చు. 10, 20, 50 నోట్లను ఫోన్ కవర్ లోపల పెట్టుకుంటే ఏం జరుగుతుందిలే అని లైట్‌గా తీసుకోవద్దు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఖరీదైన మీ స్మార్ట్ ఫోన్ పనికి రాకుండా పోతుంది. డబ్బును ఫోన్ వెనుక ఉంచడం వల్ల అది త్వరగా వేడెక్కుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే, బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.
ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్ల(Currency Notes)ను ఉంచడం వల్ల పేలిపోయే ప్రమాదమే కాక బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. వైర్‌లెస్ చార్జింగ్ పనిచేయదు. నెట్‌వర్క్(Network) సరిగా పనిచేయదు. అంతేకాకుండా, చాలా మంది స్టైలిష్‌గా కనిపించడం కోసం ఫోన్‌కు మందపాటి కవర్లను తీసుకుంటారు. దీనివల్ల ఫోన్ చల్లబడటానికి బదులుగా వేడెక్కుతుంది. ఇలాంటి చిన్న అలవాటు కూడా ప్రమాదకరం. కాబట్టి, ఫోన్ కవర్‌లో ఏమీ పెట్టకోకుండా ఉండటం మంచిది.