HomeUncategorizedKhamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఆయుత‌ల్లా అలీ ఖ‌మేనీ(Iran Supreme Leader Ayatollah Ali Khamenei)ని చంపాల‌ని ప్లాన్ చేసింది. ఇటీవ‌ల ఇజ్రాయిల్ ప్ర‌యోగించిన క్షిప‌ణులు ఖ‌మేనీ నివాసానికి స‌మీపంలో ప‌డ్డాయి.

అయితే, ఖ‌మేనీని అంత‌మొందించాల‌న్న ఇజ్రాయిల్‌(Israel) ప్ర‌ణాళిక‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) అడ్డుకున్నారని ఇద్దరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్ల‌డించింది. “ఇరానియన్​లు ఇంకా అమెరికన్ల‌పై దాడులు చేయ‌లేదు. వారు ఏదైనా చేసే వ‌ర‌కు మేము రాజకీయ నాయకత్వాన్ని వెంబడించడం గురించి మాట్లాడటం లేదు” అని అమెరికా పరిపాలన సీనియర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

ఇరాన్ అణ్వ‌స్త్ర(Iran nuclear) కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ ఆ దేశంపై భారీ దాడుల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి అమెరికా ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ అధికారులతో నిరంత‌రం కమ్యూనికేషన్‌లో ఉన్నారని సీనియ‌ర్ అధికారి ఒక‌రు చెప్పారు. ఖమేనీని చంపడానికి తమకు అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారని, కానీ ట్రంప్ ఇజ్రాయిల్ ప్ర‌ణాళిక‌ను తోసిపుచ్చారని పేర్కొన్నారు.

Khamenei : త‌ప్పుడు ప్ర‌చార‌మన్న నేత‌న్యాహు

ఖ‌మేనీని చంపేందుకు వేసిన ప్ర‌ణాళిక‌ల‌ను అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ “వీటో” (US President Trump “vetoed”) చేశార‌న్న ప్రచారాన్ని ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు(Israeli Prime Minister Benjamin Netanyahu) ఖండించారు. ఎప్పుడూ జ‌ర‌గ‌ని సంభాష‌ణ‌ల గురించి చాలా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని చెప్పారు. మేము ఏం చేయాలో అది త‌ప్ప‌కుండా చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికాకు ఏది మంచిదో అగ్ర‌రాజ్యానికి తెలుస‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇజ్రాయెల్ సైనిక దాడుల ఫలితంగా ఇరాన్‌లో పాలన మార్పు ఉండవచ్చని నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Khamenei : ఊహించ‌ని రీతిలో దాడి..

ఇజ్రాయిల్‌పై తాము చేస్తున్న దాడుల‌ను అడ్డుకుంటే అమెరికాAmerica, యూకే UK, ఫ్రాన్స్‌(France) పైనా దాడి చేస్తామ‌న్న ఇరాన్ హెచ్చ‌రిక‌ల‌పై ట్రంప్ స్పందించారు. అమెరికన్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటే యూఎస్ మిలిటరీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతుంద‌ని బెదిరించారు.

“ఇరాన్ ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా మనపై దాడి చేస్తే యుఎస్ సాయుధ దళాలు రంగంలోకి దిగుతాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో సైన్యం మీపైకి వస్తుంది” అని ట్రంప్‌ ట్రూత్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యప్రాచ్యంలో వివాదానికి దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమేనని ఆయన తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు, ఈ రక్తపాత సంఘర్షణను ముగించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.