అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arattai App | భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా (America)కు షాక్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధం అయ్యారు. సుంకాల పేరుతో భయపెడుతున్న ట్రంప్‌నకు దారి తీసుకు రావడానికి ప్రధాని మోదీ ఇప్పటికే స్వదేశీ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా భారత్‌కు చెందిన యాప్ దూసుకు పోతుండటం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ (WhatsApp)కు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ మెసెజింగ్ యాప్‌కు భారత్‌కు చెందిన అరట్టై పోటీగా వస్తోంది. క్లౌడ్ ఆధారిత సర్వీసులు అందించే ‘జోహో’ ఈ యాప్‌ను రూపొందించింది. మూడు రోజుల్లోనే ఈ యాప్ రోజువారీ సైన్అప్స్ 3 వేల నుంచి 3.5 లక్షలకు పెరిగాయి. ఈ మేరకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మూడు రోజుల్లో వంద రెట్ల వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఈ యాప్ డౌన్లోడ్లు పెరగడంతో ఇక వాట్సాప్ పని అయిపోయినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Arattai App | 2021లోనే లాంచ్..
అరట్టై అంటే తమిళం (Tamil)లో మాట్లాడుకోవడం అని అర్థం. ఈ యాప్‌ను 2021లోనే జోహో లాంచ్ చేసింది. అయితే తాజాగా దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister Dharmendra Pradhan) ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలను వాడాలని సూచించారు. దీంతో దీని డౌన్లోడ్లు భారీగా పెరిగాయి. విపరీతంగా డౌన్లోడ్లు పెరగడంతో ఎమర్జెన్సీ బేసిస్‌లో సర్వర్లను పెంచుతున్నట్లు శ్రీధర్ వెంబు తెలిపారు. కాగా వన్-టు-వన్, వాయిస్ నోట్స్, గ్రూప్ చాట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్ వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో ఉన్నాయి.
Arattai App | అదనపు ఫీచర్లతో..
ఈ యాప్‌ను అప్డేట్ చేసి నవంబర్‌లో భారీగా రిలీజ్ చేద్దామని నిర్వాహకులు భావించారు. అయితే నెల ముందుగానే డౌన్లోడ్లు విపరీతంగా పెరగడంతో ఫీచర్ల అభివృద్ధిపై జోహో చర్యలు చేపట్టింది. కాగా ప్రస్తుతం ట్రాఫిక్ పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగినట్లు జోహో తెలిపింది. ఈ మేరకు ఓటీపీ లేట్‌గా రావడం, కాల్ ఫెయిల్యూర్లు వంటి ఇబ్బందులు వస్తున్నట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిష్కరిస్తున్నట్లు యాప్ నిర్వాహకులు తెలిపారు.
Arattai App | వాట్సాప్‌కు పోటీ ఇస్తుందా..
అరట్టైలో వాట్సాప్‌లో ఉండే ఫీచర్లు అన్ని ఉన్నాయి. భారతీయ యాప్ కావడంతో ప్రజలు దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. స్పై వేర్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. ఇందులో ప్రైవసీకి గ్యారెంటీ ఉంటుందని పేరెంట్ కంపెనీ జోహో చెబుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, సోషల్ మీడియా ప్రచారంతో యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయి. iOS, Andoid యాప్ స్టోర్లలో నెంబర్ 1 డౌన్ లోడ్ అవుతున్న యాప్ గా ఇది ట్రెండింగ్ ఉంది. అయితే వాట్సాప్‌కు ఇది పోటీ ఇస్తుందా.. లేదా అనేది మున్ముందు తెలుస్తుంది.
ప్రస్తుతం దేశంలో వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వీరందరు దానిని వదిలి కొత్త యాప్‌నకు అంత సులువుగా మారే అవకాశం లేదు. దీనికి తోడు అరట్టైలో కాల్స్ ఎన్‌క్రిప్టెడ్ అయినా, చాట్స్‌కు మాత్రం ఆ సౌకర్యం లేదు. వాట్సాప్‌లో ఆ ఫీచర్ ఉండటం అడ్వాంటేజ్. అయితే అరట్టై ఫీచర్లను డెవలప్ చేసుకుంటూ.. ముందకు వెళ్తే మాత్రం వాట్సాప్‌కు పోటీగా మారుతుందని పలువరు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.