IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయంలో అప్పటి ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ (Assembly Deputy Speaker) రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసిన విషయంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఐపీఎస్​ సునీల్ నాయక్​ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. బీహార్​ కేడర్​కు చెందిన సునీల్ నాయక్​ వైసీపీ హయాంలో ఏపీకి డిప్యుటేషన్​పై వచ్చారు. అయితే నాటి ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnam Raju), కస్టడీలో ఆయనను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సునీల్ నాయక్​ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆయన తన డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని మళ్లీ బీహార్​కు వెళ్లారు.

IPS Sunil Naik Lookout Notice | అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐపీఎస్​ సునీల్​ నాయక్​పై కేసు నమోదు అయింది. పోలీసులు గతంలో నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. గుంటూరు కోర్టు (Guntur Court)లో ముందస్తు బెయిల్​ పిటిషన్​ వేశారు. దానికి ఇటీవల కోర్టు కొట్టు వేసింది. దీంతో ఏపీ పోలీసులు ఐపీఎస్​ అధికారి సునీల్ నాయక్​ను అరెస్ట్ చేయడానికి బీహార్​కు వెళ్లారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే బీహార్​ పోలీసులు (Bihar Police) అతడిని విడిపించుకొని తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. అనంతరం ఆయన ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సునీల్​ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు అక్కడే మకాం వేశారు. దీంతో ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.