అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. మధ్యలో భారత్-పాక్ ఉద్రిక్తల వలన కాస్త గ్యాప్ ఇచ్చిన తిరిగి రీషెడ్యూల్ చేశారు. ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఎవరు ఫైనల్‌కు వెళతారు, కప్ ఎవరు గెలుచుకుంటారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే మ్యాచ్ మ్యాచ్‌కి ఈ సీజన్‌లో అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఇవి చూసి క్రికెట్ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గత రాత్రి లక్నోలోని స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య భారీ ఫైట్ జరిగిన విషయం తెలిసిందే.
IPL 2025 | సరికొత్త రికార్డ్..
ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) 231 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్(Ishan Kishan), అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) వీరోచిత బ్యాటింగ్ వలన సన్‌రైజర్స్ సులువుగా 200 పరుగులు క్రాస్ చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200+ టీమ్ స్కోర్లు నమోదైన సీజన్‌గా 2025 నిలిచింది. ఈ 18వ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆయా జట్ల స్కోరు 42 సార్లు 200 దాటింది. అంతకుముందు 2024లో 41, 2023లో 37, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. ఇక, ఈ సీజన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) (Gujarat Titans) అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన టీమ్‌గా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆ జీటీ 7 సార్లు 200+ స్కోర్లు చేయడం విశేషం.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) 6, లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) చెరో ఐదుసార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), KKR ముంబయి ఇండియన్స్ (ఎంఐ) తలో 4సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)-3 సార్లు 200+ స్కోర్లు చేయడం విశేషం. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 189 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. అయితే ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్‌సీబీ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. గుజరాత్ 18 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఉండగా, అది గెలిచి టాప్ 2 స్థానాలలో నిలుస్తుందా లేదా అనేది చూడాలి.