IPL 2025 Eliminator match |ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఏకంగా 14 రికార్డులు న‌మోదు..!
IPL 2025 Eliminator match |ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఏకంగా 14 రికార్డులు న‌మోదు..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 : mumbai creates big target : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరుగుతున్న ఎలిమినేటర్Eliminator మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Mumbai Indians captain Hardik Pandya) తెలిపాడు. టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Gujarat Titans captain Shubman Gill) అన్నాడు. అయితే ముంబై బ్యాటింగ్ ముందు ఎంచుకోవ‌డం క‌లిసి వ‌చ్చింది. రోహిత్ శ‌ర్మ ( 50 బంతుల్లో 81: 9 ఫోర్స్, 4 సిక్స‌ర్స్), బెయిర్ స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్స్, 3 సిక్స‌ర్స్) రాణించ‌డంతో ముంబై జ‌ట్టు సులువుగా 200 పరుగుల స్కోరు సాధించింది. 20 ఓవ‌ర్ల‌కి గాను ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఐదు వికెట్స్ కోల్పోయి 228 ప‌రుగులు సాధించింది. గుజ‌రాత్ టైటాన్స్ గెల‌వాలి అంటే 20 ఓవ‌ర్లకి గాను 229 ప‌రుగులు సాధించాలి.

mumbai creates big target : భారీ టార్గెట్..

ఇక సూర్య కుమార్ యాద‌వ్ (33), తిల‌క్ వ‌ర్మ‌(25), పాండ్యా(9 బంతుల్లో 22 నాటౌట్), న‌మ‌న్ ధీర్(9) ప‌రుగులు చేశారు. ఇక జీటీ బౌల‌ర్స్‌లో ప్ర‌సిద్ కృష్ణ‌, సాయి కిషోర్ చెరో రెండు వికెట్స్ తీసుకున్నారు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌కి ఒక వికెట్ ద‌క్కింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ Rohit Sharma చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మకు రెండు లైఫ్స్ లభించాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గెరాల్డ్ కోయిట్జీ నేలపాలు చేశాడు.

ఆ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ 4 పరుగులకే ఔటయ్యేవాడు. సిరాజ్ Siraj వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ(Rohit Sharma) ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు. ఈ క్యాచ్ పట్టినా రోహిత్ 12 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్ శర్మ.. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. రషీద్ ఖాన్ వేసిన 9వ ఓవర్‌ నాలుగో బంతిని సిక్సర్ తరలించడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 7వేల పరుగుల మైలురాయితో పాటు 300 సిక్స్‌ల క్లబ్‌లో చేరాడు. పీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(8618) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(7000*) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.