అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా (Interstate robbery gang) సభ్యుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో (Kamareddy SP Office) మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.
సదాశివనగర్(Sadashiv nagar) మండలం మర్కల్ (markal) గ్రామానికి చెందిన గుండ్రెడ్డి గంగాధర్ తన అత్తమ్మ పనినిమిత్తం ఆమెతో హైదరాబాద్ వెళ్లాడు. అయితే జులై 19న తన తల్లిగారి ఇంటి గేటుతో పాటు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో గంగాధర్ భార్య ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 2 తులాల బంగారు చైన్, రూ.25వేల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అలాగే అదే గ్రామానికి చెందిన గుర్రపు మహేష్ తన ఇంట్లో కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జులై 18న రాత్రి దుకాణం మూసివేసి 19న చూడగా షాపు తాళం పగులగొట్టి ఉండడంతో కౌంటర్లో చూడగా రూ.12వేల నగదు కనిపించలేదు. రెండో గదిలో బీరువాలో ఉన్న 2 తులాల పుస్తెలతాడు కూడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజీ ప్రకారం విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలో మంగళవారం కల్వరాల వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి కారు వెనక్కి తిప్పి పారిపోతుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. మధ్యప్రదేశ్ (Madapradesh) రాష్ట్రం నిముచి జిల్లా బారడియాకు చెందిన సికిందర్ సొన్లాల్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో జులై 18న 9 మంది ముఠాగా ఏర్పడి జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడినట్టుగా తేలింది.
తిరిగి మళ్లీ దొంగతనాలు చేయడానికి అనుకూలంగా ఉండే స్థలం కోసం రెక్కి చేయడానికి రాగా.. పోలీసులు పట్టుకున్నారు. సికిందర్ సొన్లాల్తో పాటు అతని స్నేహితులు సంజు, విశాల్, అభిషేక్, ఫ్యూస్, అనిల్, ఉమేశ్ భాయ్, గోవింద భాయ్‌తో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎర్టిగా కారును కొనుగోలు చేసి చోరీలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
దొంగతనాల సమయంలో అడ్డుపడితే కత్తులు, రాడ్లు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అవసరమైతే వారి ప్రాణాలకు హానిచేసి దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో వారు ఒప్పుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడి వద్ద స్మార్ట్‌ఫోన్, ఎర్టిగా కారు, 4 కత్తులు, టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్, రూ.2,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.