Homeతాజావార్తలుIntelligence Bureau Jobs | డిగ్రీతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగావకాశాలు

Intelligence Bureau Jobs | డిగ్రీతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగావకాశాలు

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో (Intelligence Bureau) అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2/టెక్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ (Notification) వివరాలిలా ఉన్నాయి.

పోస్టుల సంఖ్య : 258 (ఏసీఐవో గ్రేడ్‌ 2/టెక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు)

పోస్టుల వివరాలు :
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ – 90
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ – 168

అర్హత : సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ లేదా పీజీ డిగ్రీ (Degree) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. గేట్‌ (2023, 2024, 2025) ఉత్తీర్ణత తప్పనిసరి.

వయోపరిమితి : సెప్టెంబర్‌ 28 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసువారు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ(OBC)లకు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం : రూ. 44,900 – రూ. 1,42,400 నెలకు (పే లెవల్‌ 7).

ఎంపిక విధానం: గేట్‌(GATE) స్కోర్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్‌ 25.

దరఖాస్తు గడువు : నవంబర్‌ 16.

దరఖాస్తు రుసుము : జనరల్‌(General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులకు : రూ. 200,

మిగిలినవారికి : రూ. 100

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.mha.gov.in/en లో సంప్రదించగలరు.