Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన
Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన

అక్షరటుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్‌ క్యాంపస్‌లో (TU South Campus) పార్ట్‌టైం ప్రొఫెసర్లు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటివరకు తాము సాధించిన పీహెచ్‌డీ, నెట్, సెట్‌ ధృవపత్రాలను ప్రదర్శిస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివిన తాము యూనివర్సిటీలు (University) నిర్వహించిన అన్నిరకాల పరీక్షల్లో ఉతీర్ణత సాధించి పార్ట్‌ టైం అధ్యాపకులుగా నియమితులయ్యామన్నారు.

కానీ, ప్రభుత్వాలు తమ సేవలను గుర్తించట్లేదని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్, నియామకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరి సమ్మెకు వర్సిటీలోని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సంఘీభావం తెలిపారు.