Part time professors | పార్ట్‌టైం ప్రొఫెసర్ల వినూత్న నిరసన

అక్షరటుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్‌ క్యాంపస్‌లో (TU South Campus) పార్ట్‌టైం ప్రొఫెసర్లు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటివరకు తాము సాధించిన పీహెచ్‌డీ, నెట్, సెట్‌ ధృవపత్రాలను ప్రదర్శిస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివిన తాము యూనివర్సిటీలు (University) నిర్వహించిన అన్నిరకాల పరీక్షల్లో ఉతీర్ణత సాధించి పార్ట్‌ టైం అధ్యాపకులుగా నియమితులయ్యామన్నారు. కానీ, ప్రభుత్వాలు తమ సేవలను గుర్తించట్లేదని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టో […]

అక్షరటుడే, భిక్కనూరు: Part time professors | భిక్కనూరు (Bhiknoor)లోని తెయూ సౌత్‌ క్యాంపస్‌లో (TU South Campus) పార్ట్‌టైం ప్రొఫెసర్లు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటివరకు తాము సాధించిన పీహెచ్‌డీ, నెట్, సెట్‌ ధృవపత్రాలను ప్రదర్శిస్తూ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివిన తాము యూనివర్సిటీలు (University) నిర్వహించిన అన్నిరకాల పరీక్షల్లో ఉతీర్ణత సాధించి పార్ట్‌ టైం అధ్యాపకులుగా నియమితులయ్యామన్నారు.

కానీ, ప్రభుత్వాలు తమ సేవలను గుర్తించట్లేదని వాపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్, నియామకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరి సమ్మెకు వర్సిటీలోని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సంఘీభావం తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...