అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లు (Asian Markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
రూపాయి విలువలో స్థిరత్వం కోసం ఆర్బీఐ (RBI) చర్యలు తీసుకుంటుండడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడుతోంది. బ్రోకరేజీ సంస్థలు బై రేటింగ్ ఇస్తుండడంతో పలు కంపెనీలలో వాల్యూ బయ్యింగ్ కనిపిస్తోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 147 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్దనుంచి కోలుకుని 352 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 29 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో 95 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 85,541 వద్ద, నిఫ్టీ (Nifty) 5 పాయింట్ల లాభంతో 26,181 వద్ద ఉన్నాయి.
ఐటీలో సెల్లింగ్..
బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 0.54 శాతం, హెల్త్‌కేర్ 0.20 శాతం, ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.10 శాతం నష్టంతో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.64 శాతం, పీఎస్‌యూ, టెలికాం, కమోడిటీ ఇండెక్స్‌లు 0.48 శాతం, మెటల్ 0.44 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, ఇండస్ట్రియల్ 0.40 శాతం, పవర్ 0.39 శాతం లాభాలతో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం లాభంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 1.66 శాతం, బీఈఎలÊ 0.99 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.93 శాతం, అదానిపోర్ట్స్ 0.80 శాతం, మారుతి 0.73 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్‌ఫార్మా 1.68 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఇన్ఫోసిస్ 0.61 శాతం, ఇండిగో 0.56 శాతం, టైటాన్ 0.56 శాతం నష్టాలతో ఉన్నాయి.