అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) లాభాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 205 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా ఉన్నాయి. దీంతో మన మార్కెట్లు సైతం ఆశావాహ దృక్పథంతో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 233 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 231 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 326 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 173 పాయింట్ల లాభంతో మొదలై 67 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 100 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని పైకి ఎగబాకాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 441 పాయింట్ల లాభంతో 85,259 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 26.0032 వద్ద ఉన్నాయి.
ఎఫ్ఎంసీజీ మినహా..
బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాలతో సాగుతున్నాయి. మెటల్ ఇండెక్స్ 2 శాతం, కమోడిటీ 1.41 శాతం, ఇండస్ట్రియల్ 1.04 శాతం, సర్వీసెస్ 0.88 శాతం, రియాలిటీ 0.84 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.83 శాతం, టెలికాం 0.71 శాతం, పవర్ 0.69 శాతం లాభాలతో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీఇండెక్స్ 0.36 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.13 శాతం, ఐటీ 0.05 శాతం నష్టాలతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.74 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 2.61 శాతం, ఎల్టీ 1.74 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.68 శాతం, ఎటర్నల్ 1.68 శాతం, మారుతి 1.48 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌యూఎల్ 1.72 శాతం, ఆసియా పెయింట్ 0.55 శాతం, ఇన్ఫోసిస్ 0.50 శాతం, ఐటీసీ 0.41 శాతం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 0.33 శాతం నష్టాలతో ఉన్నాయి.