ePaper
More
    Homeజాతీయంajit doval | భారత జేమ్స్​బాండ్​ అజిత్ ధోవల్.. అపర చాణక్యుడి ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు

    ajit doval | భారత జేమ్స్​బాండ్​ అజిత్ ధోవల్.. అపర చాణక్యుడి ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ajit doval | పాకిస్తాన్​తో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోన్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్(ajit doval)​పైనే అందరి దృష్టి నెలకొంది. అపర చాణక్యుడు, భారత జేమ్స్​బాండ్​గా పేరున్న ఆయన.. సంక్లిష్ట సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. ఎత్తులు వేయడంలో, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో, శత్రువుల పీచమణచడంలో ఆయనకు సాటి లేరని చెబుతారు. 2018 ఎయిర్​ స్ట్రైక్స్​, బాలాకోట్​లో బాంబింగ్ సహా అనేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించింది ధోవలే. ప్రస్తుతం పాకిస్తాన్​తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి దాయాదిని దెబ్బ కొట్టేందుకు ఆయన ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    ajit doval | దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం

    ఉత్తరాఖండ్​(Uttarakhand)లోని పౌరి గర్హ్వాల్​లో 1945లో జన్మించిన అజిత్ ధోవల్(ajit doval)​ దేశభక్తికి మారుపేరు. 40 సంవత్సరాలకు పైగా దేశానికి సేవలందిస్తూ ఇండియన్ జేమ్స్ బాండ్​గా(Indian James Bond) పేరొందారు. 1968 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన ఆయన దేశ రక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ కేడర్​లో కొట్టాయం ASPగా చేరిన ఆయన.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో(Intelligence Bureau) అద్భుతమైన కెరీర్ను కలిగి ఉన్నారు. 2004-05 వరకు ఐబీ డైరెక్టర్(IB director)​గా పనిచేశారు.

    ajit doval | సర్జికల్ స్ట్రైక్స్..

    2014లో బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ.. అజిత్ ధోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా(National Security Advisor) నియమించుకున్నారు. దేశ భద్రతను ఆయన చేతుల్లో పెట్టారు. 2016లో ఉరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయి 19 మంది సైనికులను బలి తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన తరుణంలో భారత్ పాకిస్తాన్​కు దీటుగా బదులిచ్చింది. తొలిసారి పాక్​లోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసింది. 2019లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో(Pulwama attack) 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే భారత వైమానిక దళం పాక్​లోకి మరోసారి చొచ్చుకెళ్లింది. బాలాకోట్​లో బాంబింగ్ చేసి ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను తుడిచి పెట్టేసింది. ఈ దాడుల్లో 300 మంది వరకు చనిపోయినట్లు అప్పట్లో చెప్పారు. ఈ రెండు దాడుల వెనుక మాస్టర్​మైండ్​ ధోవల్​దే.

    ajit doval | తిరుగుబాట్ల అణచివేత..

    1980లో మిజోరంలో చెలరేగిన తిరుగుబాటును ధోవల్ తన చాకచక్యంతో అణచివేశారు. మిజో నేషనల్ ఫ్రంట్లోని(Mizo National Front) 7 మంది కమాండర్లలో ఆరుగురిని ఆయన తెలివిగా తన వైపుకు తిప్పుకోగలిగారు. తద్వారా మిజోరాంలో శాంతి నెలకొల్పారు. 1990లో కాశ్మీర్​లో ఇలాగే తిరుగుబాటుదారులను అణచివేశారు. కుకా పారే అని పిలువబడే వర్గాన్ని వెనుకుండి నడిపించారు. ఉగ్రవాది మొహమ్మద్ యూసుఫ్ పారే, అతని దళాలను తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి వారిని ఒప్పించగలిగారు. దీంతో 1996లో జమ్మూకశ్మీర్ ఎన్నికలకు మార్గం సుగమం చేయడంలో ధోవల్ కీలక పాత్ర పోషించారు.

    ajit doval | పాక్​లో రహస్యంగా ఏడేళ్లు..

    ఫీల్డ్ ఆఫీసర్​గా ధోవల్(ajit doval)​కు అద్భుతమైన చరిత్ర ఉంది. శత్రుదేశమైన పాకిస్తాన్​లో ఏకంగా ఏడేండ్ల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ప్రాణాలకు తెగించి భారత్ కోసం పని చేశారు. ఆ సమయంలో ఉర్దూలో ప్రావీణ్యం సంపాదించిన అజిత్ ధోవల్.. పాకిస్తాన్ చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై పట్టు పెంచుకున్నారు. ఇది ఆయన ఏడేళ్లకు పైగా పాకిస్తాన్​లో రహస్యంగా ఉండటానికి దోహదపడింది. ఫీల్డ్​లో ఉంటూ ఎన్నో రహస్యాలను సేకరించి దేశాన్ని అనేక ప్రమాదాల నుంచి రక్షించిన ఘనత ధోవల్ సొంతం. ఇరాక్లోని తిక్రిత్ ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సుల విడుదలలో కూడా ధోవల్ కీలక పాత్ర పోషించారు. జూన్ 25న ధోవల్ ఒక అత్యంత రహస్య మిషన్​లో భాగంగా ఇరాక్​కు వెళ్లారు. ఇరాక్ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు, అధికారులతో సంబంధాలు ఏర్పరచుకుని, నర్సులను ఎర్బిల్ నగరంలోని అధికారులకు సురక్షితంగా అప్పగించమని ఐసిస్ ఉగ్రవాదులను ఒప్పించాడు.

    ajit doval | ఆపరేషన్ బ్లాక్ థండర్​లో పాత్ర

    1980లలో పంజాబ్​లో రాజ్యమేలుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని పీచమణచడంలో అజిత్ ధోవల్ కీలకంగా వ్యవహరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్​(Operation Black Thunder)కు ముందు ఆయన గోల్డెన్ టెంపుల్(Golden Temple) ప్రాంతంలో రిక్షా పుల్లర్​గా పనిచేశారు. తరువాత ఉగ్రవాదులకు మద్దతుగా అక్కడ మోహరించిన పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్​(ISI Agent)గా నటిస్తూ గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని సంపాదించిన ధోవల్ గోల్డెన్ టెంపుల్లోకి చొరబడ్డారు. తద్వారా ఎన్ఎస్జీకి(NSG) కచ్చితమైన సమాచారం అందిస్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన చూపిన ధైర్యసాహసాలకు ధోవల్​కు కీర్తి చక్ర లభించింది. ఈ పురస్కారం లభించిన తొలి పోలీసు అధికారి ఆయనే కావడం గమనార్హం. 1999లో ఇండియన్ ఎయిర్​ లైన్స్​ ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన ముష్కరులు కాందహార్కు తరలించారు. అయితే, భారత ప్రభుత్వం తరఫున చర్చలు జరిపిన వారిలో ధోవల్ ఒకరు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...