ePaper
More
    Homeఅంతర్జాతీయంBrahmos | భారత్​ బ్రహ్మోస్​ దెబ్బ తగిలింది.. నిజం ఒప్పుకున్న పాక్​ ప్రధాని

    Brahmos | భారత్​ బ్రహ్మోస్​ దెబ్బ తగిలింది.. నిజం ఒప్పుకున్న పాక్​ ప్రధాని

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brahmos | ఎట్టకేలకు పాకిస్తాన్​ ప్రధాని షాబాజ్ షరీఫ్ (Pak PM Shareef) నిజం ఒప్పుకున్నారు. భారత్​ బ్రహ్మోస్(Brahmos Missile)​ దెబ్బ తగిలిందని అంగీకరించాడు. జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​(Pahalgam)లో ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది భారత పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ చేపట్టింది. పీవోకే, పాకిస్తాన్​లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. దీంతో దాదాపు వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు.

    Brahmos | పాక్​ దాడిని తిప్పికొట్టిన భారత్​

    ఆపరేషన్​ సిందూర్​కు ప్రతీకారంగా పాకిస్తాన్(Pakistan)​ భారత్​లోని మిలటరీ స్థావరాలు, ప్రార్థన మందిరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిసైల్స్​తో దాడులకు పాల్పడింది. అయితే భారత రక్షణ వ్యవస్థ (Defence System) పాక్​ డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే అడ్డుకుంది. పాక్​ నిత్యం దాడులకు తెగబడుతుండటంతో భారత సైన్యం..​ పాక్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బ్రహ్మోస్​ క్షిపణులను (Brahmos Missiles) ప్రయోగించి దాయాది దేశం ఎయిర్​బేస్​లను (Pak Air Bases) ధ్వంసం చేసింది.

    Brahmos | పాక్​ మేకపోతు గాంభీర్యం

    భారత్​ దెబ్బతో పాక్​ అతలాకుతలం అయింది. అయినా తామే విజయం సాధించామని ఇన్ని రోజులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే తాజాగా పాక్​ ప్రధాని షాబాజ్ షరీఫ్ అజర్‌బైజాన్‌లో మాట్లాడుతూ.. భారత ఎయిర్‌స్ట్రైక్స్‌పై స్పందించారు. తాము దాడి చేయాలని ప్రణాళిక వేశామన్నారు. అంతలోగానే భారత్​ బ్రహ్మోస్​ను ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. రావల్పిండి (Ravalpindi) లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారని పాక్​ ప్రధాని ఆరోపించారు. అనేక ప్రావిన్సులపై క్షిపణి దాడులు చేశారన్నారు. దాడి విషయాన్ని ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ (asim muneer) తనకు చెప్పారని షరీఫ్​ తెలిపారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 15 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Head Constables promotions | హెడ్​ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా ప్రమోషన్లు..

    అక్షరటుడే, ఇందూరు: Head Constables promotions : ఏళ్లుగా :హెడ్​ కానిస్టేబుల్(Head Constables)​గా పని చేస్తూ వస్తున్నవారికి తాజాగా...

    constable ready for fifth marriage | కామాంధ కానిస్టేబుల్​.. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.. అధికారులు ఏం చేశారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: constable ready for fifth marriage : మంచి సర్కారు ఉద్యోగం.. అందమైన భార్య.. చింతలు...

    Kagadala rally | యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్.. గద్దె చోడ్’ కాగడాల ర్యాలీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kagadala rally : ఓట్ చోర్ .. గద్దె చోడ్ అనే నినాదంతో...

    More like this