ePaper
More
    Homeఅంతర్జాతీయంUSA | అమెరికాలో దారుణం.. భార్య, కొడుకును తుపాకీతో కాల్చి తానూ సూసైడ్​ చేసుకున్న భారత...

    USA | అమెరికాలో దారుణం.. భార్య, కొడుకును తుపాకీతో కాల్చి తానూ సూసైడ్​ చేసుకున్న భారత టెక్కీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: USA | అమెరికాలో దారుణం జరిగింది. ఓ భారతీయ టెక్కీ భార్య, కొడుకును తుపాకీతో కాల్చి చంపడంతో పాటు తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్ కుటుంబం అమెరికాలో ఉంటోంది. వాషింగ్టన్​లో స్టేట్​లోని న్యూకాజిల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. కాగా.. ఈ నెల 24న హర్షవర్ధన్​ తన భార్య శ్వేతా పాణ్యం(44), కుమారుడు ధ్రువ(14)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన ఏప్రిల్ 24న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    USA | హోలో వరల్డ్​ రోబోటిక్స్​ స్థాపించి.. కరోనా ప్రభావంతో తిరిగి అమెరికాకు..

    హర్షవర్ధన్​ తన భార్య శ్వేతతో కలిసి 2017లో ఇండియాకు వచ్చి మైసూరు కేంద్రంగా హోలో వరల్డ్(HoloWorld) అనే రోబోటిక్స్ కంపెనీని స్థాపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ప్రధాని మోదీని సైతం కలిసి దేశ సరిహద్దుల్లో రక్షణకు రోబోలను వినియోగించే ప్రతిపాదనను ఉంచారు. తదనంతరం కరోనా ప్రభావంతో 2022లో హోలో వరల్డ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో తిరిగి వీరి కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. తాజాగా ఇలా ఆత్మహత్య చేసుకోవడం చర్చకు దారితీసింది.

    More like this

    Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!

    అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...