అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND VS WI | వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు నుంచి సెకండ్ టెస్ట్ ప్రారంభమైంది. ఢిల్లీ (Delhi) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (captain Shubman Gill) టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
టాస్ అనంతరం మీడియాతో మాట్లాడిన గిల్, పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని, అందుకే తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించామని వెల్లడించాడు. గత మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ నిలకడగా ప్రదర్శన ఇవ్వాలని మేం భావిస్తున్నాం. కెప్టెన్సీ బాధ్యత నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇది నాకు భారం కాదు, కానీ బాధ్యత పెంచింది. సవాళ్లు నాకు ఇష్టం అని గిల్ చెప్పాడు.
తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా, విజయవంతమైన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతున్నట్టు గిల్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (West Indies captain Roston Chase) మాట్లాడుతూ, “మేము కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌నే ఎంచుకునేవాళ్లం. పిచ్ పొడిగా ఉంది, కానీ టాస్ Toss కోల్పోవడం పట్ల బాధలేదు అని అన్నాడు.
ఇక తుది జట్టులో రెండు మార్పులు చేసినట్టు చెబుతూ బ్రాండన్ కింగ్, జోహాన్ లేన్ లకు బదులుగా ఆండర్సన్ ఫిలిప్, తేవిన్ ఇమ్లాచ్ లు జట్టులోకి వచ్చారని తెలియజేశాడు. ఫిలిప్ కొత్త బంతితో బ్రేక్ అందిస్తాడని ఆశిస్తున్నాం. ఇమ్లాచ్ మాత్రం గయానా నుంచి వచ్చాడు. స్పిన్‌ను బాగా ఆడతాడు. ఈ పిచ్‌కి అతడు సరైన ఆప్షన్ అని ఛేజ్ వివరించాడు. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్ (14 నాటౌట్), రాహుల్ (25 నాటౌట్) ఉన్నారు.
IND VS WI | తుది జట్లు:
IND VS WI | వెస్టిండీస్:
జాన్ క్యాంప్‌బెల్, టేగనరైన్ చందర్‌పాల్, అలిక్ అతానాజ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.
IND VS WI | ఇండియా:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.