అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) బుధవారం గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేక కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలు రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గురువారం ఉదయం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 10 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 775 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 12 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 218 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 529 పాయింట్ల నష్టంతో 83,204 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 25671 వద్ద ఉన్నాయి.
ఐటీ, ఫార్మా మినహా..
ఐటీ, ఫార్మా సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ 0.44 శాతం, ఫార్మా 0.22 శాతం లాభంతో ఉన్నాయి. పవర్, రియాలిటీ, పవర్, మీడియా, కన్జూమర్ డ్యూరెబుల్స్, యుటిలిటీ ఇండెక్స్‌లు ఒక శాతం మేర నష్టంతో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్ రంగాల షేర్లూ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 26 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 1.31 శాతం, టీసీఎస్ 0.72 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.24 శాతం, టెక్‌మహీంద్రా 0.02 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ట్రెంట్ 2.29 శాతం, ఇండిగో 1.58 శాతం, ఎంఅండ్ఎం 1.48 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.31 శాతం, బీఈఎల్ 1.22 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.