అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India – America | అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటుందనే సాకుతో యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ చర్యలకు తలొగ్గని భారత్.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. తాజాగా అమెరికా(America)తో కీలక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్(Trump Tariffs)లకు కౌంటర్‌గా.. యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకోవడానికి సిద్ధ అయినట్లు సమాచారం.
India – America | ఆరు విమానాల కొనుగోలుకు ఒప్పదం
అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన P81 జెట్ల కొనుగోలుకు భారత్ 2021లో ఒప్పందం చేసుకుంది. 2.24 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకోగా.. అనంతరం దాని వ్యయం 3.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. సముద్ర గస్తీ కోసం బోయింగ్ కంపెనీ(Boeing Company) నుంచి ఈ విమానాలు కొనుగోలు చేయాలని భారత్ భావించింది. అయితే ఈ విమానాల ముడి సరుకులు భారత్ నుంచే అమెరికాకు ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ సుంకాలు పెంచడంతో విడిభాగాల ధరలు పెరగనున్నాయి. దీంతో విమానాల వ్యయం కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ డీల్‌ను రద్దు(Cancel Deal) చేసుకోవాలని భారత్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
India – America | భారత్‌కు రష్యా ఆఫర్
రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి(Oil Import) చేసుకోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. ఈ క్రమంలో రష్యా భారత్‌కు అండగా నిలిచింది. అమెరికా వైఖరిని తప్పు పట్టింది. అంతేగాకుండా మరింత తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది.
India – America | త్వరలో భారత్‌కు పుతిన్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval) రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin)తో ఆయన సమావేశంపై కీలక చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్స్ వేళ ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ ఏడాది చివరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రానున్నట్లు ఆయన ప్రకటించారు.

