అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. కోల్‌కతా (Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన 159 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కరమ్ 31 పరుగులు, మల్డర్ 24, రికెల్టన్ 23 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు బుమ్రా (Bumrah) ఐదు, సిరాజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (KL Rahul) 39, వాషింగ్టన్ సుందర్ 29, పంత్ 27 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 30 పరుగుల ఆధిక్యం సాధించింది.
IND vs SA | రెండో ఇన్నింగ్స్‌లో బోల్తా..
రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బావుమా 55 పరుగులతో సత్తా చాటాడు. భారత బౌలర్లలో జడేజా (Jadeja) నాలుగు, సిరాజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) 31, అక్షర్ పటేల్ 26 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత్ ఓడిపోయింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచారు. కాగా భారత్‌లో 15 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా గెలుపొందడం విశేషం.
IND vs SA | బ్యాటింగ్‌కు రాని గిల్
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Gill) రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన విషయం తెలిసిందే. మెడ నొప్పి కారణంగా గిల్ మైదానాన్ని వీడాడు. అనంతరం ఆస్పత్రిలో జాయిన్ కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆడలేదు. దీంతో 10 మందితోనే భారత్ బ్యాటింగ్ చేసింది.
