HomeUncategorizedE-Passport | చిప్ ఆధారిత బ‌యోమెట్రిక్ ఈ-పాస్​పోర్ట్‌.. ఇక మోసాల‌కు చెక్

E-Passport | చిప్ ఆధారిత బ‌యోమెట్రిక్ ఈ-పాస్​పోర్ట్‌.. ఇక మోసాల‌కు చెక్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : E-Passport | విదేశాల‌కి వెళ్లాలంటే పాస్​పోర్ట్ అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి. పాస్‌పోర్ట్ లేకుండా మ‌నం ప‌లుదేశాల‌కి వెళ్లే అవ‌కాశం ఉండ‌దు. అయితే కొంద‌రు దొంగ పాస్‌పోర్ట్‌ల‌తో వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో మోసాల‌కు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు ఇప్పటికే ఈ-పాస్‌పోర్ట్ సేవలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు అనుగుణంగా నాసిక్‌లోని ‘ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌’ ఈపాస్ పోర్టులను తయారుచేస్తోంది. టాటాకు చెందిన ప్రముఖ కంపెనీ టీసీఎస్‌ ఈ- పాస్ పోర్ట్ తయారీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందించనుంది.

E-Passport | ఇలా చెక్..

చిప్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ప్రారంభం కాగా, పాస్ పోర్ట్ ప‌నుల‌ని వేగ‌వంతం చేస్తున్నాయి. దీంతో మోసాల‌కు చెక్ ప‌డే అవకాశం ఉంది. ఇందులో అమర్చిన మైక్రో చిప్​లో ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ఎన్ కోడ్ చేయ‌బ‌డ‌తాయి. ఫలితంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ సాయంతో ఇందులోని వ్యక్తిగత డేటాను బదిలీ చేసుకోవడానికి బదిలీ చేయడానికి ఎలాంటి అవ‌కాశం ఉండదు. ఒకవేళ ఈ మైక్రో చిప్​ను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించినా ఇట్టే దొరికేస్తారు. గ‌తంలో కూడా మైక్రో చిప్ (Micro Chip) తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీచేయనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో ఇది పౌరులకు అందుబాటులోకి వ‌స్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న పుస్తకాల పాస్ పోర్ట్ (Pass Port)ల స్థానంలో అతి త్వరలోనే ఈ- పాస్‌ పోర్ట్‌లను జారీ చేస్తుంది. ఈ పాస్‌ పోర్ట్‌ బయోమెట్రిక్‌ డేటాతో మరింత సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ఇమిగ్రేషన్‌ చెక్‌ పోస్ట్‌ల వద్ద చెకింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు.