అక్షరటుడే, బోధన్ : మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలకే బీఫాంలు ఇచ్చామని మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) అన్నారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Bodhan BRS B-forms | నాయకులకు గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న నాయకులకు గౌరవం ఇవ్వని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) ప్రజలకు ఏం గౌరవం ఇస్తారని మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే సుదర్శన్ రెడ్డికి ప్రజలపై ప్రేమ వస్తుందని నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపాలని సవాల్ విసిరారు.
Bodhan BRS B-forms | రెండేళ్లయినా అభివృద్ధి ఊసే లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా బోధన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని షకీల్ అన్నారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బోధన్ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆయేషా ఫాతిమా, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Bodhan BRS B-forms | బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
1వ వార్డు సనా తబస్సుమ్, 2వ వార్డు ముజీబ్, 3వ వార్డు ఫాతిమా బేగం, 4వ వార్డు నసీర్ బేగం, 5వ వార్డు, అబిద్ పాషా, 6వ వార్డు షేక్ జాకీర్, 7వ వార్డు రజియా బేగం, 8వ వార్డు షంసున్నిసా బేగం, 9వ వార్డు ఎండీ గౌడ్, 10వ వార్డు కె.చైతన్య, 11వ వార్డు షహిస్తా ప్రవీణ్, 12వ వార్డు ఎంఈ రహీముద్దీన్, 13వ వార్డు కనక రాజు, 14వ వార్డు తహీన్ సుల్తానా, 15వ వార్డు గుమ్ముల అశోక్ రెడ్డి, 16వ వార్డు ఎం హరి శంకర్, 17వ వార్డు తాహెర్, 18వ వార్డు మహమ్మద్ హుస్సేన్, 19వ వార్డు అఫ్రీన్ బేగం, 20వ వార్డు తబస్సుమ్ ఖనూం, 21వ వార్డు ముబిన్ అహ్మద్, 22వ వార్డు ఇంతియాజ్ హుస్సేన్, 23వ వార్డు ప్రభావతి, 24వ వార్డు లక్ష్మి, 25వ వార్డు కృష్ణ, 26వ వార్డు శ్రీనివాస్ రెడ్డి, 27వ వార్డు అబ్దుల్లా అహ్మద్, 28వ వార్డు షహనాజ్ సిమ్రన్, 29వ వార్డు ఆస్రా తువ్రియా సుల్తానా, 30వ వార్డు సందీప్, 31వ వార్డు శ్రీలత, 32వ వార్డు వడ్ల త్రివేణి, 33వ వార్డు బింగి నాగమణి, 34వ వార్డు ముషీర్ బాబా, 35వ వార్డు సంధ్యరాణి, 36వ వార్డు మెహనాజ్, 37వ వార్డు గంగుల దేవిదాస్, 38వ వార్డు ఫర్జానా బేగం.