HomeతెలంగాణFake Birth Certificate | బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు

Fake Birth Certificate | బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Fake Birth Certificate | అక్రమంగా బర్త్​ సర్టిఫికెట్లు ఇస్తున్న ముఠాను పోలీసులు(Police) అరెస్టు చేశారు. హైదరాబాద్​ శివారులోని నార్సింగ్​ మున్సిపాలిటీ(Narsingh Municipality)లో కంప్యూటర్​ ఆపరేటర్​గా పనిచేసే సుధీర్​ మరికొందరితో కలిసి నకిలీ సర్టిఫికెట్ల(Fake certificates) దందాకు తెరలేపాడు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ బంగ్లా దేశీయులకు బర్త్​ సర్టిఫికెట్లు(Birth Certificates) ఇస్తున్నాడు. ఒక్కో బర్త్ సర్టిఫికెట్‌కు రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్​తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్​లో ఇప్పటికే వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు(Bangladeshis) అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రోహింగ్యాలు అక్రమంగా వచ్చి పలు ప్రాంతాల్లో స్థిర పడ్డారు. ఇప్పటికే వీరిలో కొందరు ఓటర్​, ఆధార్​ కార్డులు కూడా పొందారు.

తాజాగా నకిలీ సర్టిఫికెట్లు(Fake certificates) వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా ఉన్నారో.. వారికి సుధీర్​ లాంటి వారు ఎంత మంది సాయం చేస్తున్నారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. చొరబాటుదారులకు అక్రమంగా సర్టిఫికెట్లు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.