అక్షరటుడే, ఇందూరు: Malyala Archana Anil | నగరంలో 37వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని బీజేపీ అభ్యర్థిని మల్యాల అర్చన అనిల్ యాదవ్ (Malyala Archana Anil Yadav) అన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో..
నగరంలో ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ఆధ్వర్యంలో నగరాభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే డివిజన్లో వారి మద్దతుతో అభివృద్ధి చేసే అవకాశం తనకు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కాలనీల్లో ప్రతిఒక్కరినీ పలకరిస్తూ ముందుకు వెళ్లారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
కార్పొరేటర్‌గా తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తార రాజు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా భావిస్తూ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.