అక్షరటుడే, ఇందూరు: Kakatiya Institutions | సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం ఎస్పీ సాయిశ్రీ (Cybercrime SP Sai Sri) సూచించారు. కాకతీయ ఇనిస్టిట్యూట్ (Kakatiya Institute) ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా గుర్తించి 1930కు కాల్ చేయాలని సూచించారు.
Kakatiya Institutions | డేటింగ్ యాప్‌తో మోసాలు..
సైబర్ క్రైం (cyber crime) జరిగితే ముందుగా ఎటువంటి ఆందోళన చెందకుండా పోలీసులకు తెలపాలన్నారు. ప్రధానంగా డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లియింగ్, సైబర్ స్టాకింగ్, మాట్రిమోనియల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలపై కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, వాటిని గుర్తిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికి బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ బస్వారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
