HomeUncategorizedDonald trump | అణుయుద్ధాన్ని ఆపాను.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Donald trump | అణుయుద్ధాన్ని ఆపాను.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ donald trump​ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్​, పాకిస్తాన్​ మధ్య అణుయుద్ధాన్ని nuclear war ఆపానని ఆయన అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ceasefire కోసం రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అణుయుద్ధం జరిగితే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆయన అన్నారు.

అలాగే రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత్​తో తాము చర్చిస్తున్నట్లు తెలిపారు. పాక్​తోనూ త్వరలో చర్చలు జరుపుతామన్నారు. కాగా.. ఆపరేషన్​ సిందూర్​ తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు శనివారం కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో తానే రెండు దేశాలను సీజ్​ఫైర్​ కోసం ఒప్పించినట్లు ట్రంప్​ తెలిపారు. అయితే భారత్​ మాత్రం పాకిస్తాన్​ డీజీఎంవో ఫోన్​ చేసి చర్చలు జరపడంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపింది.