I Am Hind | ఐయామ్​ హిందూ.. కాశీలో టాటూ ఉద్యమం.. బారులు తీరుతున్న జనం

అక్షరటుడే, న్యూఢిల్లీ: I Am Hind : పహల్గావ్​ లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పర్యాటకులను హిందువులుగా నిర్ధారించుకోవడానికి ముష్కరులు వికృతంగా ప్రవర్తించారు. కల్మా చదవమన్నారు. హిందువులను నిర్ధారించుకుని మరీ విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఇలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా హిందువులంతా ఏకమవుతున్నారు. ముఖ్యంగా వారణాసిలో ధైర్యంగా బయటకి వస్తున్నారు. తాము హిందువులమంటూ చేతిపై కాషాయ జెండాతో సహా టాటూ వేయించుకుని సవాలు విసురుతున్నారు. పూర్వం ప్రజలు శరీరం మీద పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: I Am Hind : పహల్గావ్​ లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పర్యాటకులను హిందువులుగా నిర్ధారించుకోవడానికి ముష్కరులు వికృతంగా ప్రవర్తించారు. కల్మా చదవమన్నారు. హిందువులను నిర్ధారించుకుని మరీ విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఇలాంటి తరుణంలో దేశవ్యాప్తంగా హిందువులంతా ఏకమవుతున్నారు. ముఖ్యంగా వారణాసిలో ధైర్యంగా బయటకి వస్తున్నారు. తాము హిందువులమంటూ చేతిపై కాషాయ జెండాతో సహా టాటూ వేయించుకుని సవాలు విసురుతున్నారు.

పూర్వం ప్రజలు శరీరం మీద పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు దాని స్థానంలో టాటూలు tatto వచ్చాయి. గత కొన్నేళ్లుగా టాటూల సంస్కృతి పెరిగింది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గావ్​లో జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత.. ’హిందూ’ HINDU అనే పదంతో టాటూలు వేయించుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

వారణాసిలో varanasi హిందూ పదాన్ని టాటూ వేయించుకునే వారిని టాటూయిస్టులు Tattooists సైతం ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు 50% తగ్గింపును అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్‌ Uttar Pradesh లోని వారణాసి జిల్లాలో భారీగా టాటూ స్టాల్స్, షాపులు ఉన్నాయి. ఇప్పుడు వాటి వద్ద రద్దీ నెలకొంది. అత్యధికంగా హిందూ అనే పదాన్ని చేతులపై టాటూగా వేయించుకోవడానికి వస్తున్నారు.

వారణాసి Varanasi లోని పాండే ఘాట్‌ Pandey Ghat లో ఉండే ఓ టాటూ ఆర్టిస్టు మాట్లాడుతూ.. హిందూ అనే పదాన్ని టాటూగా వేయించుకోవడానికి నిత్యం తన వద్దకు 25 నుంచి 30 మంది వస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ఈ టాటూను వేయించుకునేలా తాము హిందూ టాటూల Hindu tattoos పై 50% తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

శివ్‌పూర్ నివాసి ఒకరు మాట్లాడుతూ.. పహల్గావ్​ Pahalgaon లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ పర్యాటకుల tourists ను చంపేశారు.. మా మతం ఏమిటని అడగాల్సిన అవసరం లేదు. అందరికీ స్పష్టంగా తెలిసేలా చేతులపై హిందూ అనే పదాన్ని రాయించుకుంటున్నామని వివరించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.