అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fire Safety | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లిలో ఇటీవల బచ్చాస్ ఫర్నీచర్ షోరూంలో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. దీంతో నగరంలో ఫైర్ సేఫ్టిపై హైడ్రా తనిఖీలు చేపడుతోంది.
నగరంలో షాపులతో పాటు వాణిజ్య సముదాయాల్లో హైడ్రా తనిఖీలు ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఉన్న నీరూస్ షోరూంను గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath), అధికారులు తనిఖీ చేశారు. మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులకు తోడు.. పైన అనుమతి లేని రూఫ్ షెడ్డు వేసి వస్త్రాలతో నింపేయడంతో హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని మాపక శాఖ నుంచి ఎన్వోసీ లేకుండా దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకపోవడంతో నీరూస్ షో రూమ్ (Neerus Showroom)ను సీజ్ చేశారు.
Fire Safety | ఫర్నీచర్ షోరూమ్‌కు తాళం
నాంపల్లి స్టేషన్ రోడ్డు (Nampally Station Road)లో గత శనివారం బచ్చాస్ ఫర్నీచర్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగి, ఐదుగురు చనిపోయారు. ఘటన తర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై హైడ్రా కమిషనర్ మండిపడ్డారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులో రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణం ఉన్న భవనం 6 అంతస్తులుండగా.. సెల్లార్‌తో పాటు.. మొత్తం అన్ని అంతస్తుల్లో భారీగా ఫర్నీచర్ నిల్వ ఉంచారు. మెట్ల మార్గాన్ని కూడా మూసేసిన విధంగా స్టాక్ పెట్టడం పట్ల హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్వోసీ లేకపోవడంతో పాటు.. 6 అంతస్తుల్లో ఎక్కడా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించకపోవడంతో సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఆ భవనానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ భవనంలో వ్యాపార లావాదేవీలు జరగకుండా చర్యలు చేపట్టారు.