అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shops Seized | అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా అధికారులు (Hydra officials) నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ (fire safety) నిబంధనలు పాటించని దుకాణాలపై కొరఢా ఝుళిపిస్తున్నారు.
నాంపల్లిలోని (Nampally) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ నిల్వ చేయడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం తనిఖీలు చేపట్టి రెండు దుకాణాలను సీజ్ చేశారు. శుక్రవారం సైతం తనిఖీలు చేపట్టి ఆరు దుకాణాలపై చర్యలు తీసుకున్నారు.
Shops Seized | సంయుక్తంగా తనిఖీలు
జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పట్టించుకోకుండా షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. సెల్లార్లను గోదాములుగా మార్చడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమికల్, పెయింట్ డబ్బాలు నిలువ ఉంచడం, ఫర్నీచర్ తయారీ సామగ్రీతో పరిసరాలు నిండి ఉండడాన్ని అధికారులు గమనించారు.
Shops Seized | బోర్డుల ఏర్పాటు
గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్ బిల్డింగ్‌ను అధికారులు సీజ్ చేశారు. సెల్లార్లలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉండే నిలువలు ఉంచినట్లు గుర్తించారు. కొంపల్లి క్రాస్ రోడ్స్‌లోని (Kompally Cross Roads) అను ఫర్నిచర్ షో రూంలో కూడా ఇలాగే ఉండటంతో చర్యలు తీసుకున్నారు. కూకట్‌పల్లితో పాటు అత్తాపూర్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేలో ఉన్న రోయల్ ఓక్ ఫర్నీచర్ షాపుల్లో కూడా నిలువలు ప్రమాదకరంగా సెల్లార్లలో నింపేయడంతో అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ నాగోల్‌లోని బాంటియా ఫర్నీచర్ షోరూం, నాచారంలోని అను ఫర్నీచర్ షోరూంను సీజ్ చేశారు. ఈ షాపుల పరిసరాలు ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.