అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | నాలాల ఆక్రమణలను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) సిబ్బందిని ఆదేశించారు. హైడ్రా కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి (Prajavani) కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై బుధవారం కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
తూముకుంట మున్సిపాలిటీ (Thumukunta Municipality)లోని దేవరాయాంజాల్ గ్రామంలో హైడ్రా కమిషనర్ పర్యటించారు. గ్రామంలోని సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హ కోర్టు ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అదే మార్గంలో కొత్తగా కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తున్న క్రమంలో రహదారిని వెంటనే పునరుద్ధరించాలని స్థానిక మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేవరాయాంజాల్ విలేజ్‌లోని వరద కాలువ ఆక్రమణలను పరిశీలించారు.
Hydraa | వరద కాలువ పునరుద్ధరించాలి
తుర్కవాణి కుంట నుంచి దేవరాయాంజాల్ చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జా కావడంతో నాలుగు కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రామ రికార్డ్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ మ్యాపుల ఆధారంగా వరద కాలువ గతంలో ఎంత విస్తీర్ణంలో ఉందో చూడాలని కమిషనర్ ఆదేశించారు. ఆక్రమణలు తొలగించి వరద కాలువను పునరుద్ధరించాలని సూచించారు. తూముకుంట గ్రామంలోని వాసవి సుచిర్ ఇండియా లే అవుట్లో నాలా కుంచించుకుపోవడాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. 9 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా 2 మీటర్లకే పరిమితం చేయడంతో అదే వెంచర్‌లోని ప్లాట్లతో పాటు పై భాగంలో ఉన్న నివాసాలు కూడా మునిగిపోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ అధికారులతో పాటు వెంచర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.
1 comment
[…] ఆక్రమణలపై హైడ్రా (Hydraa)ఉక్కుపాదం మోపుతున్న విషయం […]
Comments are closed.