అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Software Engineer Murder | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు.
వనస్థలిపురం (Vanasthalipuram) గ్రీన్ సిటీ కాలనీ (Green City Colony)లో సాఫ్ట్వేర్ సునీత (30) నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో మహేశ్ అనే వ్యక్తితో వివాహం అయింది. అయితే కుటుంబ కలహాలతో సునీత అతడి నుంచి విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి సైతం చేసుకుంది. అయితే తనకు విడాకులు ఇచ్చిందని సునీతపై మహేశ్ కోపం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో బుధవారం సునీతను దారుణంగా హత్య చేశాడు.
Hyderabad Software Engineer Murder | పోలీసుల అదుపులో నిందితుడు
మహేశ్ రెండు కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆమెను కత్తులతో పొడిచి, పూలకుండీతో తల పగలగొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.