అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad railway terminals | రైళ్ల రద్దీ దృష్ట్యా తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్ చుట్టూ కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్లు రాబోతున్నాయి. ఈమేరకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఢిల్లీ Delhi, బెంగళూరు Bangalore, కోల్‌కతా Kolkata తదితర మహా నగరాల శివారు ప్రాంతాల్లోనూ భారీ రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను వీటిల్లో నిలువరిస్తున్నారు.
అదే విధంగా హైదరాబాద్‌లోనూ రైళ్ల రద్దీని తగ్గించేందుకు ఈ మహా నగరం చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లను తీసుకొస్తున్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో వీటిని నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.
Hyderabad railway terminals : ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్
భాగ్య నగరానికి ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్ Cherlapalli Terminal అందుబాటులోకి వచ్చింది. ఇది వరంగల్ మార్గంలో ఉంది. ఇక వికారాబాద్ – ముంబయి మార్గంలో రావాల్సి ఉంది. రామచంద్రాపురం మండలం నాగులపల్లిలో టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉంది.
ఇక నిజామాబాద్ – నాందేడ్ మార్గం (Nizamabad-Nanded route) లో డబిల్‌పుర్(మేడ్చల్) Dabilpur (Medchal), మహబూబ్‌నగర్ – బెంగళూరు మార్గంలో జూకల్ (శంషాబాద్) టెర్మినళ్లు terminals నిర్మించాలనే యోచనలో రైల్వే శాఖ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో ప్రతిపాదన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రస్థావించింది.