అక్షరటుడే, వెబ్‌డెస్క్:Hyderabad Mall Fire | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మెట్రోస్టేషన్ సమీపంలోని మంగళగౌరి షాపింగ్‌మాల్ (Mangalaguri Shopping Mall)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం మాల్ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతం షాప్ నడవడం లేదని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరమ్మతులు పనులు కొనసాగుతుండటంతో నలుగురు కార్మికులు లోపల చిక్కుకున్నారని, వారిని బ్యాక్ డోర్ ద్వారా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా నగరంలో ఇటీవల అగ్నిప్రమాదాలు (Fire Accident) ఆందోళన కలిగిస్తున్నాయి. గతతంలో బచ్చాస్ ఫర్నిచర్ షోరూమ్‌లో మంటలు అంటుకొని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలోని ఓ బైక్ షోరూంలో మంటలు అంటుకున్నాయి. అంతకుముందు అత్తాపూర్‌లో కార్ల షోరూమ్ (Car Showroom)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు కాలిపోయాయి.
