అక్షరటుడే, డిచ్పల్లి : Dichpally | వర్షాలకు రైతన్న ఆగమైపోతున్నాడు. కళ్లెదుటే ఆరుగాలం శ్రమించిన పంట తడిసిపోతుంటే ఆందోళన చెందుతున్నాడు. డిచ్పల్లి (Dichpally) మండలంలోని సుద్దపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షాల కారణంగా పంట పూర్తిగా తడిసిపోవడంతో పెట్టుబడి సైతం అందని పరిస్థితిలో ఉన్నామని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Dichpally | బోనస్ ఇచ్చి ధాన్యం కొనాలి..
తడిసిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు ఈ సందర్భంగా కోరుతున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేనందున ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొంథా తుపాన్ (Cyclone Montha) ఎఫెక్ట్ మరోరెండురోజులు ఉందని.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (Purchasing Centers) ఎలాంటి సౌకర్యాలు లేవని వారు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

