అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | హిందువుల ఐక్యతే దేశానికి భద్రత అని విశ్వహిందూ పరిషత్ నాయకులు (Vishwa Hindu Parishad leaders) పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
Yellareddy Mandal | బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దహనం..
పట్టణంలోని పోచమ్మ గుడి నుంచి బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని (Bangladesh Prime Minister) దిష్టిబొమ్మను దహనం చేశారు. అ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ పాకిస్థాన్‌తో విడిపోయిన బంగ్లాదేశ్ మళ్లీ ఆ దేశంతో చేయి కలిపి భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసే కుట్ర చేస్తోందన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని నిరసిస్తూ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు.