అక్షరటుడే, ఇందూరు: high-risk deliveries | శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ఇరువురి ప్రాణాలను రక్షించిన వారమవుతామని.. హై రిస్క్ గర్భధారణ, అకాల ప్రసవాల్లో ‘గోల్డెన్ హవర్’ కీలకమని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు పేర్కొన్నారు.
జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో జరిగే అకాల ప్రసవాల్లో దాదాపు మూడో వంతు భారత్లోనే ఉంటోందన్నారు. ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు అకాలంగా జన్మిస్తుండగా.. వీరిలో చాలా శిశువులు జన్మించిన తొలి గంటలోనే (“గోల్డెన్ అవర్”) ప్రత్యేక నీయోనేటల్ చికిత్స అవసరం అవుతోందన్నారు.
నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్కు చెందిన సీనియర్ నీయోనేటాలజిస్ట్ డా. రవీందర్ రెడ్డి పరిగె, పీడియాట్రిక్ సర్జన్ డా. మధుమోహన్ మాట్లాడారు.
అత్యంత అకాల శిశువులకు..
అకాలంలో జన్మించిన శిశువుల జీవన శాతం, వారి దీర్ఘకాలిక అభివృద్ధి అనేది.. ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు, సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, విభాగాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని వైద్యులు తెలిపారు. 23–24 వారాల్లో జన్మించిన అత్యంత అకాల శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని మెడికవర్ Medicover ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్లో అత్యాధునిక ఎన్ఐసీయూ (NICU) సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాక్ష్యాధారిత చికిత్సా విధానాలు, కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా అకాల శిశువుల్లో మెరుగైన చికిత్సా ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.
డా. రవీందర్ రెడ్డి పరిగె (HOD Neonatology and Pediatrics) మాట్లాడుతూ.. హై రిస్క్ గర్భధారణలు, నవజాత శిశువుల సమస్యలను తొలిదశలోనే గుర్తించి సరైన కేంద్రాలకు రిఫర్ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో అవగాహన పెంపొందించడం ద్వారా చికిత్సలో ఆలస్యం నివారించవచ్చని తెలిపారు.
డా. మధుమోహన్ రెడ్డి (Senior Paediatric Surgeon) మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో, జన్మించిన వెంటనే గుర్తించే జన్మతహ శస్త్రచికిత్స అవసరమైన సమస్యలను ప్రసూతి నిపుణులు, నీయోనేటాలజిస్టులు, పీడియాట్రిక్ సర్జన్ల మధ్య సమన్వయంతో సురక్షితంగా చికిత్స చేయవచ్చని చెప్పారు.
డా. తేజస్వి (గైనకాలజిస్ట్) మాట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భధారణలను తొలిదశలోనే గుర్తించడం అత్యంత అవసరమన్నారు. తీవ్రమైన రక్తహీనత, గర్భకాల రక్తపోటు, గర్భకాల మధుమేహం, శిశువు ఎదుగుదల లోపం వంటి సమస్యలు ప్రసవానికి ముందే సంకేతాలు చూపుతాయని ఆమె చెప్పారు.
నియమిత గర్భకాల పరీక్షలు, సమయానికి అవసరమైన పరీక్షలు, వైద్య నిపుణుల సమన్వయం ద్వారా తల్లి-శిశువు సంక్లిష్టతలను తగ్గించి, అధిక ప్రమాద గర్భధారణలలో కూడా సురక్షిత ప్రసవాలను సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, మెడికవర్ నిజామాబాద్ – హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్ మధ్య ఉన్న క్లినికల్ కోఆర్డినేషన్ వ్యవస్థను వైద్యులు వివరించారు. అవసరమైన సందర్భాల్లో తల్లి – శిశువుకు ముందస్తు స్థిరీకరణ, వైద్య మార్గనిర్దేశం, సురక్షిత బదిలీ ప్రక్రియ అమలులో ఉందని తెలిపారు. సమయానుకూల రిఫరల్, సమన్వయ వైద్యం, అవగాహన పెంపుదల ద్వారా హై రిస్క్ గర్భధారణలు, అకాల శిశు మరణాలను తగ్గించవచ్చని వైద్యులు వివరించారు.