అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | తెలంగాణ హైకోర్టు High Court కు మే 5 నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవులు summer holidays ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవుల్లో ప్రత్యేక బెంచ్‌లు special benches అత్యవసర కేసులను విచారిస్తాయి. May 7, 14, 21, 28, జూన్ 4న ప్రత్యేక బెంచ్‌ల్లో విచారణ జరుగుతుంది. అయితే పిటిషనర్లు రెండు రోజుల ముందే పిటిషన్ దాఖలు petition file చేయాల్సి ఉంటుంది. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, కూల్చివేతలకు సంబంధించిన అత్యవసర పిటిషన్లను మాత్రమే కోర్టు స్వీకరించనుంది. ఆయా తేదీల్లో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ధర్మాసనాలు పనిచేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.