Virat Kohli | అనుష్క కాపురంలో నిప్పులు.. విరాట్ కోహ్లీ కీలక ప్రకటన!

అక్షరటుడే, వెబ్​డెస్క్:Virat Kohli | బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్(Avneet Kaur) హాట్ ఫొటోలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లైక్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీలో ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో గ్రీన్ క్రాప్ టాప్‌తో పాటు ప్రింటెడ్ వ్రాప్ స్కర్ట్ ధరించిన అవనీత్ కౌర్.. చాలా బోల్డ్‌గా ఫోజులిచ్చింది. అయితే ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Virat Kohli | బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్(Avneet Kaur) హాట్ ఫొటోలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లైక్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీలో ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో గ్రీన్ క్రాప్ టాప్‌తో పాటు ప్రింటెడ్ వ్రాప్ స్కర్ట్ ధరించిన అవనీత్ కౌర్.. చాలా బోల్డ్‌గా ఫోజులిచ్చింది. అయితే ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో పాటు డిస్ లైక్ చేశాడు.

అవనీత్ కౌర్(Avneet Kaur) అందానికి ఫిదా అయ్యే విరాట్ కోహ్లీ లైక్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma)ను ట్యాగ్ చేసి మరీ.. రచ్చ చేశారు. అనుష్క శర్మ కాపురంలో అవనీత్ కౌర్ నిప్పులు పోసేందుకు రెడీ అయ్యిందని పోస్ట్‌లు పెట్టారు. దాంతో కోహ్లీ లైక్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని గ్రహించిన కోహ్లీ.. ఇన్‌స్టా స్టోరీ(Insta Story)లో క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా వివరణ ఇచ్చాడు.

ఇన్‌స్టా అల్గారిథమ్(Insta algorithm) పొరపాటు వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నాడు. అనవసర ఊహాగానాలను ప్రచారంలోకి తీసుకు రావద్దని నెటిజన్లను కోరాడు. ‘నా ఫీడ్‌ను క్లియర్ చేసే సమయంలో అల్గారిథమ్ పొరపాటు వల్ల ఇది జరిగింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి అనవసరమైన ఊహాగానాలను ప్రచారంలోకి తీసుకురావద్దు. ధన్యవాదాలు’అని కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీ(Insta Story)లో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ పొరపాటున ఒక్క పోస్ట్ లైక్ చేసినందుకు నెటిజన్లు(Netizens) పెడర్థాలు తీస్తూ అతని పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారు.

ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ(RCB) వరుస విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే 7 విజయాలు నమోదు చేసిన ఆర్‌సీబీ.. మరోక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...