అక్షరటుడే, హైదరాబాద్: High Court reprimands Hydrana | గ్రేటర్ హైదరాబాద్‌లో సామాన్యుల ఆక్రమణలపై రెచ్చిపోతూ.. బడాబాబుల విషయంలో నిమ్మకుండా ఉండిపోతున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు వేసింది.
చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే అన్ని విషయాల్లో హైడ్రా జోక్యం చేసుకోకుండా నిషేధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అసలు హైడ్రాకు ఉన్న చట్ట పరిమితి ఏమిటని ప్రశ్నించింది. ఏ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుందని నిలదీసింది.
High Court reprimands Hydrana | సంధ్య కన్వెన్షన్ కూల్చివేత విషయంలో..
హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు మండిపడింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ నిర్మాణాలు కూల్చివేసిన విషయంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వ్యతిరేకంగా సదరు యజమానులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సమయంలో, చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు.
కాగా, నోటీసులో ఆక్రమణకు గురైన ప్లాట్ల వివరాలు స్పష్టంగా తెలపకుండా.. ఉదయాన్నే ఎందుకు కూల్చివేతలు చేపట్టారు? అని హైకోర్టు నిలదీసింది.
ఒక వ్యక్తి లేదా అధికారికి అపరిమిత అధికారాలు ఇస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం కూడా వారిని నియంత్రించలేని రోజులు వస్తాయని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
హైడ్రాను నియంత్రించే విధంగా చట్టాలు లేవు, అసలు హైడ్రాకు ఉన్న అధికార పరిమితి ఏంటి? జీహెచ్ఎంసీ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తుందా? అంటూ న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇలాగే కోర్టు నోటీసులు పట్టించుకోకుండా వ్యవహరిస్తే, జలవనరులు, నాలాల పరిరక్షణ తప్ప వేరే కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు.
