అక్షరటుడే, వెబ్డెస్క్ :Delhi | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత టెర్రరిస్టులు దేశ రాజధాని ఢిల్లీలో dellhi city దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 27 పర్యాటకులను(Tourists) అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్కు సింధు జలాలను(Indus River) ఆపేసింది. అయితే ఉగ్రవాదులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ముఖ్యంగా ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉందని సమాచారం. దీంతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) అప్రమత్తం అయ్యారు. దేశ రాజధానిలోని టూరిస్ట్ ప్లేస్(Tourists Place)ల్లో భద్రతను భారీగా పెంచారు. అనుమానితులు కనిపిస్తే విచారిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులతో(Intelligence Officers) సమన్వయం చేసుకుంటూ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
