అక్షరటుడే, బాన్సువాడ: Rainfall | ఉమ్మడి వర్ని మండలంలోని చందూర్, మోస్రా, వర్ని మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు అరగంట పాటు భారీవర్షంతో పాటు ఈదురు గాలులు రావడంతో శ్రీనగర్ శివారులో భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డు మధ్యలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును తొలగించడంతో రాకపోకలు సాగాయి.
