ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Visakhapatnam | విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికారులు

    Visakhapatnam | విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Visakhapatnam | ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం (Visakhapatnam)లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం సాయంత్రం వైజాగ్​ భారీ వర్షం పడుతోంది. విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో జిల్లాలో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు.

    భారీ వర్షాలు పడుతుండటంతో గ్రేటర్​ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)​ అధికారులు అప్రమత్తం అయ్యారు. జీవీఎంసీ కార్యాలయంలో కంట్రోల్​ రూం ఏర్పాటు చేశారు. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే టోల్‌ఫ్రీ నెం:1800 4250 0009 కు ఫోన్​ చేయాలని సూచించారు. కాగా భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కూడా విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఆ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​ జారీ చేశారు.

    Latest articles

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    Nizamabad private hospital | ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి.. ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad private hospital | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...

    More like this