అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain Alert | తెలంగాణను వానలు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం (LPA)తో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
గురువారం రోజంతా వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో ముసురు వాన పడగా.. కొన్ని చోట్ల మోస్తరు జల్లులు కురిశాయి. రాత్రి సమయంలో వాన దంచి కొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు.
Heavy Rain Alert | ఆ జిల్లాలకు అలెర్ట్
రానున్న 48 గంటలు తెలంగాణలో అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, భువనగిరి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Heavy Rain Alert | వర్ష బీభత్సం
రాష్ట్రంలో గురువారం వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి పూట కుండపోత వాన కురిసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కూడా వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. చెరువులు, వాగులు, జలాశయాల సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
Heavy Rain Alert | వర్షపాతం వివరాలు..
రాష్ట్రంలో గురువారం ఉదయం 8:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా నల్గొండ (Nalgonda) జిల్లా తిరుమల సాగర్లో 125.5 మి.మీ. వర్షం కురిసింది. జనగామ జిల్లా జఫర్గడ్లో 110.3, నల్గొండ జిల్లా పులిచెర్లలో 102.8, ములుగు జిల్లా మేడారంలో 101.3, వికారాబాద్ జిల్లా ముజాహిద్పూర్లో 97.5, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 92.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.
[…] […]