HomeతెలంగాణProjects | ప్రాజెక్ట్​లకు భారీగా వరద

Projects | ప్రాజెక్ట్​లకు భారీగా వరద

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లకు భారీగా వరద(Heavy Flood) కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వానలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర డ్యామ్‌(Tungabhadra Dam)కు వరద పెరగడంలో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ప్రస్తుతం 32,459 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 36,178 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాల నుంచి జూరాలకు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.

Projects | మూసీ ప్రాజెక్ట్​ నాలుగు గేట్లు ఎత్తివేత

జూరాల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)​కు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రస్తుతం 81,638 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. వరద గేట్లు, విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 879 అడుగులకు చేరింది. మరోవైపు సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని మూసీ ప్రాజెక్ట్​ సైతం జలకళను సంతరించుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Projects | హిమాయత్​ సాగర్​ నాలుగు గేట్లు ఓపెన్​

హైదరాబాద్​ నగర శివారులోని హిమాయత్​ సాగర్​(Himayat Sagar)కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. 2500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో నగరంలోని మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Projects | గోదావరికి తగ్గిన వరద

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర క్రమంగా గోదావరికి వరద తగ్గుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ 85గేట్లుఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 75,550 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదుతుతున్నారు.

Projects | వాగులో కొట్టుకుపోయిన కారు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదుల వాగు ఉధృతంగా పారుతోంది. వాగుపై గల బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా.. ఓ కారు ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే స్థానికులు వెంటనే స్పందించి అందులోని ఏడుగురిని తాడు సాయంతో కాపాడారు.