అక్షరటుడే, ఇందూరు: HM Suspended | ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డి సస్పెన్షన్‌కు (suspended) గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల (municipal election) నిర్వహణలో భాగంగా ఆర్మూర్‌లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా ప్రధానోపాధ్యాయురాలు వనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
HM Suspended | ఎలాంటి అనుమతి లేకుండా..
అయితే ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎం వనజా రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు.