ePaper
More
    HomeUncategorizedHDFC Bank | అంచనాలకు మించిన హెచ్‌డీఎఫ్‌సీ లాభం

    HDFC Bank | అంచనాలకు మించిన హెచ్‌డీఎఫ్‌సీ లాభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: HDFC Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌Largest private sector bank అయిన హెచ్‌డీఎఫ్‌సీ 2024-25 జనవరి-మార్చి త్రైమాసికానికి Quarterly సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి లాభాలను ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    HDFC Bank | 6.8 శాతం పెరిగిన లాభం..

    2024- 25 జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏకీకృత(Consolidated) ప్రాతిపదికన రూ.18,835 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.17,622 కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగింది.
    క్యూ–4లో స్టాండలోన్(Standalone) నికర లాభం రూ.17,616 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 6.6 శాతం మేర లాభం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం రూ. 16,521.9 కోట్లుగా ఉంది. కాగా నికరలాభం రూ.17,058.1కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ అంచనా వేసింది.

    HDFC Bank | రెవెన్యూలో..

    సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాదిలో నమోదైన రూ.89,639 కోట్లనుంచి రూ.89,488 కోట్లకు పెరిగింది. ఈ మూడు నెలల్లో వడ్డీ రూపంలో రూ.77,460 కోట్లు ఆర్జించింది. కాగా 2023-24 ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.71,473 కోట్లుగా ఉంది.

    HDFC Bank | స్వల్పంగా తగ్గిన ఆస్తుల నాణ్యత..

    ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. ఈ త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు 1.24 శాతం నుంచి 1.33 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 6.8 శాతం వృద్ధి చెంది, రూ.18,835 కోట్లు నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17,622 కోట్లుగా ఉంది.

    HDFC Bank | బ్యాలెన్స్ షీట్​..

    మార్చి31 నాటికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ Balance sheet విలువ రూ.39.10 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ మొత్తం రూ.36.17లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కో షేరుకు 2200 శాతం చొప్పున అంటే ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్(Dividend) ప్రకటించింది.

    HDFC Bank | స్టాక్‌ పనితీరు

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత ట్రేడింగ్‌ సెషన్‌Trading sessionలో (గురువారం) 1.53 శాతం పెరిగి రూ. 1,907 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్ట ధర రూ. 1,920 కాగా.. కనిష్ట ధర రూ. 1,427. ఐదేళ్లలో తన పెట్టుబడిదారులకు 16 శాతం లాభాలను ఇచ్చిన ఈ స్టాక్‌.. ఏడాదిలో 25 శాతం రాబడిని అందించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...