HDFC Bank | అంచనాలకు మించిన హెచ్‌డీఎఫ్‌సీ లాభం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: HDFC Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌Largest private sector bank అయిన హెచ్‌డీఎఫ్‌సీ 2024-25 జనవరి-మార్చి త్రైమాసికానికి Quarterly సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి లాభాలను ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. HDFC Bank | 6.8 శాతం పెరిగిన లాభం.. 2024- 25 జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏకీకృత(Consolidated) ప్రాతిపదికన రూ.18,835 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.17,622 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: HDFC Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌Largest private sector bank అయిన హెచ్‌డీఎఫ్‌సీ 2024-25 జనవరి-మార్చి త్రైమాసికానికి Quarterly సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి లాభాలను ఆర్జించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

HDFC Bank | 6.8 శాతం పెరిగిన లాభం..

2024- 25 జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం ఏకీకృత(Consolidated) ప్రాతిపదికన రూ.18,835 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.17,622 కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగింది.
క్యూ–4లో స్టాండలోన్(Standalone) నికర లాభం రూ.17,616 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 6.6 శాతం మేర లాభం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభం రూ. 16,521.9 కోట్లుగా ఉంది. కాగా నికరలాభం రూ.17,058.1కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ అంచనా వేసింది.

HDFC Bank | రెవెన్యూలో..

సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాదిలో నమోదైన రూ.89,639 కోట్లనుంచి రూ.89,488 కోట్లకు పెరిగింది. ఈ మూడు నెలల్లో వడ్డీ రూపంలో రూ.77,460 కోట్లు ఆర్జించింది. కాగా 2023-24 ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.71,473 కోట్లుగా ఉంది.

HDFC Bank | స్వల్పంగా తగ్గిన ఆస్తుల నాణ్యత..

ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. ఈ త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు 1.24 శాతం నుంచి 1.33 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 6.8 శాతం వృద్ధి చెంది, రూ.18,835 కోట్లు నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17,622 కోట్లుగా ఉంది.

HDFC Bank | బ్యాలెన్స్ షీట్​..

మార్చి31 నాటికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ Balance sheet విలువ రూ.39.10 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ మొత్తం రూ.36.17లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కో షేరుకు 2200 శాతం చొప్పున అంటే ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్(Dividend) ప్రకటించింది.

HDFC Bank | స్టాక్‌ పనితీరు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత ట్రేడింగ్‌ సెషన్‌Trading sessionలో (గురువారం) 1.53 శాతం పెరిగి రూ. 1,907 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్ట ధర రూ. 1,920 కాగా.. కనిష్ట ధర రూ. 1,427. ఐదేళ్లలో తన పెట్టుబడిదారులకు 16 శాతం లాభాలను ఇచ్చిన ఈ స్టాక్‌.. ఏడాదిలో 25 శాతం రాబడిని అందించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...