HomeUncategorizedChhattisgarh Encounter | నంబాల, స‌జ్జ‌ మృత‌దేహాలు అప్ప‌గించండి.. హైకోర్టులో కుటుంబ స‌భ్యుల పిటిష‌న్‌

Chhattisgarh Encounter | నంబాల, స‌జ్జ‌ మృత‌దేహాలు అప్ప‌గించండి.. హైకోర్టులో కుటుంబ స‌భ్యుల పిటిష‌న్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Chhattisgarh Encounter | ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన‌ మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంబాల కేశ‌వ‌రావు(Nambala Keshav Rao), స‌జ్జ నాగేశ్వ‌ర‌రావు(Sajja Nageshwar Rao) మృత‌దేహాల‌ను అప్ప‌గించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court) శ‌నివారం విచార‌ణ జ‌రిపింది. చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోల‌కు భారీ దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరావు స‌హా 28 మంది హ‌త‌మ‌య్యారు. కేంద్ర క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్థాయి వ్య‌క్తి ఎన్‌కౌంట‌ర్‌(Encounter)లో మృతిచెంద‌డం ఇదే తొలిసారి. అయితే, ఎన్‌కౌంట‌ర్ జ‌రిగి రోజులు గ‌డుస్తున్నా మృత‌దేహాల‌ను అప్ప‌గించ‌క పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

నంబాల, నాగేశ్వరరావు తరపు బంధువులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు(High Court) ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. విచార‌ణ సందర్భంగా ఛత్తీస్‌గ‌ఢ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ మాట్లాడుతూ.. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిందని చెప్పారు. ఇప్పటికే 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే, ఈ పిటిష‌న్‌పై ఏపీ ప్ర‌భుత్వం(AP Government) విభిన్నంగా స్పందించింది. ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో జ‌రిగినందున
అక్కడే పిటిషన్ వేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పోస్టుమార్టం పూర్తవ్వడంతో మృతదేహాలను ఇస్తామని చెబుతున్నారని, అందువలన పిటిషనర్లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించవచ్చని సూచించింది. ఈ మేరకు పిటిషనర్లకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది.

Must Read
Related News