అక్షరటుడే, ఇందూరు: Guru Nanak Jayanti | సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాజులపేట (Gajulpet), పాముల బస్తీలో ఉన్న గురుద్వారాలో ఉదయం నుంచి భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు. గురుద్వారా (Gurudwara) పూజారి సర్దార్ సోహన్ సింగ్ గ్రంథి, సర్దార్ జిత్తు సింగ్ గ్రంథి ఆధ్వర్యంలో ఆరాధన చేశారు. గురు గ్రంథ్ సాహెబ్‌ను పఠిస్తూ ఉత్సవాలను నిర్వహించారు.
Guru Nanak Jayanti | భక్తితో నగర సంకీర్తన్..
గురునానక్ జయంతిని పురస్కరించుకొని నగర సంకీర్తన్ నిర్వహించారు. అనంతరం గాజుల్ పేట్‌లోని గురుద్వారా నుంచి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర పెద్దబజార్, నెహ్రూ పార్క్, పవన్ థియేటర్ మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంది. శోభాయాత్రలో కర్ర, కత్తి సాము, యుద్ధ విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. నాందేడ్ (nanded) నుంచి ప్రత్యేకంగా వచ్చిన వాహనంలో గురు గ్రంథ్ సాహెబ్‌ను ఊరేగించారు.

