అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dhurandhar Movie | రణ్వీర్ సింగ్ హీరో (Hero Ranveer Singh)గా తెరకెక్కిన ధురంధర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. భారత్‌లో మంచి వసూళ్లు రాబడుతోంది. విదేశాల్లో సైతం ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే గల్ఫ్ దేశాలు ధురంధర్ సినిమాను బ్యాన్ చేశాయి.
స్పై థ్రిల్లర్ (Spy Thriller)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఇందులో పాకిస్థాన్ వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరు గల్ఫ్ దేశాలు బ్యాన్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో దీనిని నిషేధించారు. బాలీవుడ్‌కు కీలకమైన మార్కెట్ అయిన గల్ఫ్ అంతటా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ప్రతిచోటా అనుమతి రాలేదు.
Dhurandhar Movie | గతంలో సైతం..
గతంలో సైతం పలు భారత చిత్రాలు గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) విడుదల కాలేదు. ముఖ్యంగా సరిహద్దు నేపథ్యంలో తీసిన సినిమాలు విడుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొన్నాయి. ప్రారంభంలో UAEలో విడుదలైన ఫైటర్ కూడా ఒక రోజులోనే నిలిపివేయబడింది. ధురంధర్‌ను గల్ఫ్ దేశాలు బ్యాన్ చేయడంతో వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లలో దూసుకు పోతుంది. ఒక వారంలోనే రూ.200 కోట్ల మార్కును దాటింది.
ఆదిత్య దత్ దర్శకత్వం (Director Aditya Dutt) వహించిన ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్‌ను భారతీయ అధికారిగా చూపించారు. అతను రహస్యంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి దాని నేర, రాజకీయ నెట్‌వర్క్‌లలో అలలు సృష్టిస్తాడు. దీంతో పాక్ వ్యతిరేక ప్రస్తావన ఉందనే కారణంతో గల్ఫ్ దేశాలు ఈ సినిమాను బ్యాన్ చేశాయి. గల్ఫ్ దేశాలు మినహా మిగతా దేశాల్లో ఈ మూవీ రూ.44 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.